అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs AUS | ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు Indian team గురువారం అడిలైడ్ ఓవల్‌లో రెండో వన్డే ఆడుతుంది.. ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో సిరీస్‌ను కాపాడుకోవాలంటే టీమ్ ఇండియాకు తప్పక విజయం సాధించాల్సి ఉంది.
దీపావళి Diwali ముగిసినప్పటికి భారత క్రికెట్ అభిమానుల ఉత్సాహం తగ్గలేదు. గురువారం ‘డబుల్ బ్లాక్‌బస్టర్ బొనాంజా’ ఫ్యాన్స్‌కి మంచి మజా ఇస్తుందని భావిస్తున్నారు.
స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న మహిళల జట్టు, ఆస్ట్రేలియా Australia పర్యటనలో ఉన్న పురుషుల జట్లు తమ ప్రత్యర్థులతో కీలక మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యాయి.
వరల్డ్ కప్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లడానికి హర్మన్‌ప్రీత్ కౌర్ సేన న్యూజిలాండ్‌తో మరి కొద్ది నిమిషాలలో పోరుకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడమే ఈ సిరీస్‌లో ముందడుగు వేసే కీలక అంశంగా మారింది.
IND vs AUS | అడిలైడ్ రెండో వన్డే కీలకం
ఆస్ట్రేలియా Australia పర్యటన ఓటమితో ప్రారంభించిన భారత జట్టు, గురువారం రెండో వన్డే ఆడనుంది. అడిలైడ్ ఓవల్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లో సిరీస్‌ను కాపాడుకోవాలంటే టీమ్ ఇండియా తప్పక గెలవాలి.
మొదటి మ్యాచ్ వర్షం కారణంగా బ్యాటింగ్ లయ దెబ్బతినడంతో గిల్ సేన నిరాశపరచింది. తొలి మ్యాచ్ ఓడటంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేయడం భారత ఆటగాళ్ల ముందు ముఖ్య లక్ష్యంగా మారింది.
ఏడు నెలల తర్వాత పునరాగమనం చేసిన రోహిత్, కోహ్లీ మెప్పిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అడిలైడ్‌లో 2008 నుంచి కొనసాగుతున్న విజయాల పరంపరను మెన్ ఇన్ బ్లూ కొనసాగించగలరా అనే ఆత్రుత ఉంది.
తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన గిల్, అడిలైడ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బుధవారం నెట్స్‌లో రోహిత్, గౌతం గంభీర్ Gambhir పర్యవేక్షణలో బ్యాటింగ్ ప్రాక్టీస్ జరిగింది.
యశస్వీ జైస్వాల్, కుల్‌దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్లకు అవకాశం ఉండకపోవచ్చని ప్రచారం జరగగా, అదే నిజమైంది. టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
దీంతో కుల్దీప్‌కి మరోసారి నిరాశే ఎదురైంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు జరిగాయి. కీపర్ స్థానంలో క్యారీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా, కున్హెమన్ స్థానంలో స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా అవకాశం దక్కించుకున్నాడు.
మొదటి వన్డేలో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు అడిలైడ్‌లో కూడా అదే ఊపును కొనసాగించి సిరీస్ గెలవాలని భావిస్తోంది.
జట్లు:
భారత్: రోహిత్, గిల్ (కెప్టెన్), శ్రేయాస్, అక్షర్, రాహుల్, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్, సిరాజ్, అర్ష్‌దీప్
ఆస్ట్రేలియా: హెడ్, మార్ష్ (కెప్టెన్), షార్ట్, రెన్షా, కేరీ, ఓవెన్, కూపర్, స్టార్క్, ఎల్లీస్, జంపా, హాజిల్‌వుడ్
