Homeక్రీడలుIND vs AUS | టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. వ‌న్డేలోకి ఆరంగేట్రం చేసిన‌ హైద‌రాబాద్ ఆట‌గాడు

IND vs AUS | టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. వ‌న్డేలోకి ఆరంగేట్రం చేసిన‌ హైద‌రాబాద్ ఆట‌గాడు

IND vs AUS | చాలా రోజుల త‌ర్వాత రోహిత్, విరాట్‌ని మ‌ళ్లీ బ్లూ జెర్సీలో చూడ‌బోతున్నాం. ఈ మ్యాచ్‌లో వీరిద్ద‌రు ఎలాంటి ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తారా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs AUS | చాలా రోజుల త‌ర్వాత రోహిత్ Rohit, విరాట్‌ Virat ని మ‌ళ్లీ బ్లూ జెర్సీ blue jersey లో చూడ‌బోతున్నాం. ఈ మ్యాచ్‌లో వీరిద్ద‌రు ఎలాంటి ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తారా.. అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ Indian cricket అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. లెజెండరీ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ Rohit Sharma , విరాట్ కోహ్లీ Virat Kohli మళ్లీ నీలి జెర్సీలో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

దాదాపు ఏడు నెలల గ్యాప్‌ తర్వాత మైదానంలోకి అడుగుపెట్టబోతున్న ఈ స్టార్ ప్లేయర్ల రీఎంట్రీపై అభిమానుల్లో భారీ ఎగ్జైట్‌మెంట్ నెలకొంది.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి నేడు పెర్త్ వేదిక కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇదే తొలి పోరు. ఈ ఏడాది మార్చిలో ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్–కోహ్లీ ద్వయం వన్డేల్లో ఆడటం ఇదే మొదటిసారి కావడంతో ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

IND vs AUS | ‘రోకో’పై ఫోకస్‌

టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో కొనసాగాలని నిర్ణయించుకున్న రోహిత్–కోహ్లీ జంట ఈ సిరీస్‌తో మళ్లీ ఆరంగేట్రం చేస్తున్నారు.

ఒకరి సారథ్యంలో ఒకరు కాకుండా మరో కెప్టెన్ నేతృత్వంలో ఆడటం వీరికి తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న ప్రత్యేక సందర్భం. 2027 వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి సారించిన ఈ ఇద్దరూ, అందుకోసం తమ ఫామ్‌ను మరోసారి నిరూపించుకోవాలనే ఆతృతతో ఉన్నారు.

రోహిత్ శర్మ మూడు నెలల్లోనే 12 కిలోల బరువు తగ్గి ఫిట్‌గా మారడం గమనార్హం. మిత్రుడు అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో ప్రత్యేకంగా సాధన చేశాడు. మరోవైపు లండన్‌లో ట్రైనింగ్‌ చేస్తున్న విరాట్ కోహ్లీ కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో సిద్ధమయ్యాడు.

వన్డేల్లో కెప్టెన్‌గా తొలిసారిగా పగ్గాలు చేపట్టిన శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌తోనే తన నాయకత్వ ప్రతిభను చూపించాల్సి ఉంది. టెస్టుల్లో రాణించిన గిల్ ఇప్పుడు హిట్‌మ్యాన్ స్థానాన్ని భర్తీ చేయగలడా.. అనేది ఆసక్తికర అంశం. రోహిత్ వన్డే కెప్టెన్‌గా 75% విజయాలు సాధించినందున ఆ స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం గిల్‌కు సవాలుగా మారనుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. వన్డే ప్రపంచకప్‌ దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా తమ కొత్త తరం ఆటగాళ్లకు అవకాశం ఇవ్వబోతోంది.

కమిన్స్, గ్రీన్, జాంపా లాంటి సీనియర్లు లేని జట్టులో మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్పీ, కున్హెమన్‌లకు ఛాన్స్ ఇచ్చారు. హెడ్‌, కెప్టెన్ మార్ష్‌, స్టార్క్‌, హాజిల్‌వుడ్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉండటంతో సవాలు తక్కువేం కాదు.

మొత్తం మీద, రోహిత్–కోహ్లీ రీ ఎంట్రీతో భారత్–ఆస్ట్రేలియా సిరీస్ మొదటి వన్డే హై వోల్టేజ్ క్రికెట్ యాక్షన్‌కి వేదిక కానుంది. అభిమానులు “రోకో” జోడీ బ్యాటింగ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇక మ్యాచ్​తో హైద‌రాబాద్ ఆట‌గాడు వ‌న్డేలోకి ఆరంగేట్రం చేస్తున్నాడు

ఆస్ట్రేలియా టీమ్‌లో హెడ్, మిచెల్ మార్ష్‌( కెప్టెన్), షార్ట్, ఫిలిప్పి ( వికెట్ కీప‌ర్), రెన్షా, ఓవెన్, కూప‌ర్, స్టార్క్, ఎల్లిస్, కున్హెమన్, హాజిల్‌వుడ్

భార‌త జ‌ట్టు చూస్తే.. రోహిత్ శ‌ర్మ‌, గిల్‌, కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్, రాహుల్‌, అక్ష‌ర్ ప‌టేల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, నితీష్ రెడ్డి, హ‌ర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్