అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ind vs Aus | ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండవ వన్డే అక్టోబర్ 23న జరగనుంది. తొలి వన్డేలో ఓటమి పాలైన నేపథ్యంలో, టీమ్ ఇండియా (Team India) ప్లేయింగ్ 11లో భారీ మార్పులు చోటు చేసుకోవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తొలి వన్డేలో కేవలం 8 పరుగులు చేసి అవుట్ అయినందున, అతని స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు (Yashasvi Jaiswal) ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. మరోవైపు, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినందున, అతని స్థానంలో కీలక స్పిన్నర్ కులదీప్ యాదవ్‌ని తీసుకోవాలని జట్టు యాజమాన్యం పరిగణిస్తుంది.
Ind vs Aus | రోహిత్ ఔట్..!
అడిలైడ్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, కుల్‌దీప్ బౌలింగ్ విభాగాన్ని బలపరుస్తాడని విశ్లేషకులు చెబుతున్నారు.బౌలింగ్‌లో యువ పేసర్ హర్షిత్ రాణా మొదటి మ్యాచ్‌లో అంతగా రాణించలేకపోవడంతో అతని స్థానంలో పొడవైన ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రసిద్ధ్ అదనపు బౌన్స్‌తో ఆస్ట్రేలియా (Australia) పిచ్‌లపై ప్రభావం చూపగలడు. భారత జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శన ద్వారా జట్టును విజయపథంలో నడిపే అవకాశం ఉంది. అడిలైడ్ వేదికగా జరిగే ఈ రెండో వన్డే సిరీస్‌ను సమం చేయడానికి కీలకం కానుంది.
రెండో వన్డే నుండి రోహిత్ శర్మని తప్పిస్తే మాత్రం ఆయన కెరీర్ ప్రశ్నార్ధకంగా మారడం ఖాయం. రానున్న రోజుల్లో వన్డేలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న మ్యాచ్‌లలో కూడా రోహిత్‌ని పక్కన పెట్టేస్తే ఆయన రానున్న వరల్డ్‌కప్ (World Cup) వరకు కూడా ఆడే అవకాశం లేదంటూ కొందరు జోస్యాలు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
భారత జట్టు ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు..
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
టీమిండియా బలమైన మార్పులు, పక్కా వ్యూహంతో బరిలోకి దిగితే, విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు.