Homeజిల్లాలునిజామాబాద్​Sriramsagar Project | శ్రీరాంసాగర్​కు పెరుగుతున్న ఇన్​ఫ్లో..

Sriramsagar Project | శ్రీరాంసాగర్​కు పెరుగుతున్న ఇన్​ఫ్లో..

- Advertisement -

అక్షరటుడే ఆర్మూర్: Sriramsagar Project | ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు​లోకి వరద పెరుగుతోంది. నిజామాబాద్ (Nizamabad)​, నిర్మల్ (Nirmal)​ జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి నీళ్లు వస్తున్నాయి.

జలాశయంలో సోమవారం నాటికి 34,734 క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా.. మంగళవారం ఉదయం 9 గంటలకు 5,658 క్యూసెక్కుల ఇన్​ఫ్లోకు పడిపోయింది. కాగా.. బుధవారం ఉదయం 5,498 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చింది. మధ్యాహ్నానికి 12,769 క్యూసెక్కులకు పెరిగింది.

Sriramsagar Project | ప్రాజెక్ట్​ పరిధిలోని పంటలకు సాగునీరు..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని 6,24,000 ఎకరాలకు ప్రస్తుతం నీటిని వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 47.549 టీఎంసీలు, 1080.90 అడుగులు నీటి నిల్వ ఉంది. కాకతీయ కాలువ (kakatiya kaluva) ద్వారా 3,500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3,000 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. లక్ష్మి కాలువ (laxmi kaluva) ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ (saraswathi kaluva) ద్వారా 800 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు పోతోంది.

Sriramsagar Project | గుత్ప, అలీసాగర్​​కు నిలిచిన నీళ్లు..

గుత్ప (Guthpa), అలీసాగర్ (Alisagar) ఎత్తిపోతలకు నీటి విడుదలను బుధవారం నిలిపివేశారు. కాకతీయ కాలువ పరిధిలోని జోన్-1 ఏడు రోజులు జోన్-2కు 8 రోజుల పాటు నీటిని అందించనున్నారు. మిగిలిన కాల్వలకు ఏడు రోజుల పాటు ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి తెలిపారు. బుధవారం ఉదయం ప్రాజెక్టులో 44.937 టీఎంసీలు, 1080.00 అడుగులుగా ఉంది.

Must Read
Related News