అక్షరటుడే ఆర్మూర్: Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్‌లోకి క్రమంగా వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,630 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్ట్ పరిధిలోని సుమారు 6 లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు.
కాకతీయ కాలువ (Kakatiya kaluva) ద్వారా 3వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే సరస్వతి కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, అలీ సాగర్ (Alisagar) ఎత్తిపోతలకు 180 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 270 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Sriramsagar Project | నవంబర్ 20వ తేదీ వరకు..
ఆవిరి రూపంలో 467 క్యూసెక్కులు మొత్తంగా 7,773 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటి విడుదల నవంబర్ 20 వరకు కొనసాగనుంది. కాకతీయ కాలువ పరిధిలోని జోన్ -1కు ఏడు రోజులు జోన్- 2కు 8 రోజుల పాటు నీటిని అందించనున్నారు. మిగిలిన కాల్వలకు ఏడు రోజుల ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని వదులుతున్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు.