Homeజిల్లాలునిజామాబాద్​Pocharam project | పోచారం ప్రాజెక్టులోకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

Pocharam project | పోచారం ప్రాజెక్టులోకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project | ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాంధారి పెద్దవాగు, తాడ్వాయి భీమేశ్వరం వాగుల (Bhimeshwaram vaagu) ద్వారా ప్రాజెక్టులోకి వరద వస్తోంది. 120 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నారు. రెండు మండలాల్లో వేసిన 12వేల ఎకరాల పంటలకు సంరక్షించేందుకు నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 20 అడుగులకు నీరు చేరుకుంది. కాగా.. ఇలాగే వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి పొంగిపొర్లు అవకాశాలు ఉన్నాయి. దీంతో రెండు మండలాల్లో పంటలకు నీరందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలెవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

Must Read
Related News