అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయని పోచారం ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతోంది.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాంధారి (Gandhari) పెద్దవాగు, తాడ్వాయి (tadwai) భీమేశ్వరం వాగుల (Bhimeshwaram vaagu) ద్వారా 2వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వస్తోంది. 120 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నారు. రెండు మండలాల్లో వేసిన 12వేల ఎకరాల పంటలకు సంరక్షించేందుకు నీటి విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
Pocharam Project | ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో..
ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 18.6 అడుగులకు నీరు చేరుకుంది. గత ఏడాది ఈ సమయానికి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. కానీ ఈఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో నేటికీ ప్రాజెక్టు నిండలేదు. కాగా.. ఇలాగే వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి రెండు మండలాల్లో పంటలకు నీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలెవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.