HomeUncategorizedCorona Virus | పెరుగుతున్న కరోనా కేసులు

Corona Virus | పెరుగుతున్న కరోనా కేసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Corona Virus | దేశవ్యాప్తంగా కరోనా కేసులు (Corona Cases) క్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం దేశంలో 5,755 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. శుక్రవారం కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో కరోనాతో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతి చెందారు. ఏపీలో నిన్న 10, తెలంగాణ(Telangana)లో 4 కేసులు కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఏపీలో 72, తెలంగాణలో 9 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో అధికారులు కరోనా సోకిన వారిని ఐసోలేషన్(Isolation)​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Corona Virus | వరుస కేసుల భయం

ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అయింది. వానాకాలం అంటేనే సీజనల్​ వ్యాధులు ప్రబలుతాయి. ఈ క్రమంలోనే కరోనా(Corona) వ్యాపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు కరోనా సోకితే.. ఏది సీజనల్ జ్వరమో.. ఏది కరోనానో తెలియదని అంటున్నారు. దీంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూచనలు జారీ చేసింది.