ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Sriramsagar Project | 20 టీఎంసీలకు చేరిన ఎస్సారెస్పీ నీటిమట్టం

    Sriramsagar Project | 20 టీఎంసీలకు చేరిన ఎస్సారెస్పీ నీటిమట్టం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌: Sriramsagar Project | శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నీటిమట్టం 2‌‌0 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రలోని (Maharashtra) బాబ్లీ ప్రాజెక్టు(Babli Project) గేట్లు ఎత్తడంతో పాటు, ఇటీవల కురిసిన వర్షాలకు ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం జలాశయంలోకి 6,100 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. బుధవారం 4,291 క్యూసెక్కుల మేర ఇన్​ఫ్లో ఉండగా.. గురువారం రోజు సుమారు రెండు వేల క్యూసెక్యుల వరద పెరిగింది.

    Sriramsagar Project | ప్రస్తుతం 20 టీఎంసీల నిల్వ

    ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.006 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 12.324 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రస్తుతం ఆవిరి రూపంలో 341 క్యూసెక్కులు పోతుండగా.. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9.3 టీఎంసీల నీరు జలాశయంలోకి వచ్చి చేరగా.. 2.1 టీఎంసీలు దిగువకు వెళ్లాయి.

    READ ALSO  Drunk drive | మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి జైలు

    Sriramsagar Project | గతేడాది 293 టీఎంసీల ఇన్​ఫ్లో

    గతేడాది ఎగువ నుంచి 293 టీఎంసీల నీరు శ్రీరాంసాగర్​లోకి (Sriramsagar Project) రాగా యాసంగి పంటలకు ప్రాజెక్ట్​ పరిధిలోని 6,24,000 ఎకరాలకు 73 టీఎంసీల నీటిని అందించారు. మిగిలిన నీరు కాకతీయ, లక్ష్మి, సరస్వతి, వరద కాల్వల ద్వారా మల్లన్నసాగర్ (Mallanna sagar), మిడ్ మానేరు (Mid Manor)కు సాగు, తాగునీటిని అందించారు. మిగతా నీటిని నదిలోకి వదిలారు. ఈ యేడు సైతం ప్రాజెక్టులోకి 60 టీఎంసీల నీటినిల్వ అనంతరం ఖరీఫ్ పంటల సాగుకు నీటి విడుదల విషయమై ప్రాజెక్టు అధికారులు ప్రణాళికలు రూపొందించనున్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ కొత్తరవి తెలిపారు.

    Latest articles

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    Special Officers | ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పది జిల్లాలకు...

    Anganwadi centers | అంగ‌న్‌వాడీ.. అసౌకర్యాల బడి

    అక్ష‌ర‌టుడే, భీమ్‌గ‌ల్‌: Anganwadi centers | అంగన్​వాడీ కేంద్రాలు అసౌకర్యాలకు నెలవుగా మారాయి. సెంటర్లలో కనీస సౌకర్యాలు కరువవడంతో...

    More like this