అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price | బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో చెప్పడం కష్టమే. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో లక్ష మార్కు దాటేసిన బంగారం ధరలు.. ఆ తర్వాత ఆ దూకుడు తగ్గించింది. వాస్తవానికి అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం(Gold), వెండి(silver) ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధర పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.
20 మే 2025 మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,520 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,560 గా ఉంది. వెండి కిలో ధర రూ.98,100లుగా ఉంది. తులం బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది.
Today Gold Price : బంగారానికి రెక్కలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,560, 24 క్యారెట్ల ధర రూ.95,520గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,560, 24 క్యారెట్ల ధర రూ.95,520గా ఉంది.
ఢిల్లీ(Delhi)లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,710, 24 క్యారెట్ల ధర రూ.95,670 గా ఉంది.ముంబయి(Mumbai)లో 22 క్యారెట్ల ధర రూ.87,560, 24 క్యారెట్ల ధర రూ.95,520 గా ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,560, 24 క్యారెట్ల రేటు రూ.95,520 గా ఉంది.
బెంగళూరు(Bangalore)లో 22 క్యారెట్ల ధర(22 carat price) రూ.87,560, 24 క్యారెట్ల(24 carat) ధర రూ.95,520గా ఉంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్(wedding season) వేళ బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ పెరుగుదల కాస్త ఇబ్బందిగానే మారుతుంది.
మరోవైపు ఇన్నాళ్లు స్తబ్ధంగా ఉన్న వెండి మాత్రం ఈ రోజు పెరిగింది. వెండిపై ఏకంగా రూ.100 పెరగడంతో ధర రూ.98,100లుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,300 పెరిగి రూ.98,100కు చేరింది. ఇక హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతిలో కేజీ వెండి రేటు రూ.1,09,000గా ఉంది. అంతేకాదు చెన్నై(Chennai), కేరళ(Kerala), భోపాల్(Bhopal) వంటి ప్రాంతాల్లో కూడా వెండి ధరలు రూ.1,09,000గా ఉన్నాయి.