Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | త్రివేణి సంగమం వద్ద భద్రతను పెంచండి: సీపీ ఆదేశం

CP Sai Chaitanya | త్రివేణి సంగమం వద్ద భద్రతను పెంచండి: సీపీ ఆదేశం

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | రెంజల్​ పోలీస్​స్టేషన్ (Renjal Police station)​ పరిధిలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సీపీ సాయి చైతన్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన త్రివేణి సంగమాన్ని (Triveni sangamam) సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ.. నదీ పరీవాహక ప్రాంతాల్లో మొక్కులు తీర్చుకునేందుకు ప్రజలు రానున్నందున భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. నదిలో స్నానమాచరించేందుకు యువత ఉత్సాహం చూపుతారని వారికి నీటి ప్రవాహంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సంగమం వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఘాట్ల వద్ద బారికేడ్లు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయించాలని సూచించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas), బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు (Bodhan Rural Inspector Vijay Babu), రెంజల్ ఎస్సై చంద్ర మోహన్​ ఉన్నారు.