అక్షరటుడే, వెబ్డెస్క్ : CBI Trap | ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ (Vijayawada)లో ఇన్కం ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, మరో మధ్యవర్తిని లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు (CBI Officers) మంగళవారం అరెస్ట్ చేశారు.
ఓ వ్యక్తిపై వచ్చిన పిటిషన్లపై చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం ఇన్‌స్పెక్టర్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రూ.70 వేల లంచం తీసుకుంటుండగా.. ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్, ప్రైవేట్ వ్యక్తిని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు.
CBI Trap | రూ.5 లక్షలు డిమాండ్
ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న సదురు అధికారి ఏలూరులోని రామచంద్రరావు పేటలో మొబైల్ సర్వీస్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై ఐటీ దాడులు జరపకుండా ఉండటానికి మొదట రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పడంతో చివరకు రూ.1.20 లక్షలకు మధ్యవర్తి ద్వారా ఒప్పందం కుదిరింది.
ఇందులో రూ.లక్ష అధికారికి, రూ.20 మధ్యవర్తి తీసుకోవాలని ఒప్పదం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ తరఫున ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు వల పన్ని మధ్యవర్తిని పట్టుకున్నారు. అనంతరం సదరు అధికారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.