Homeక్రైంHyderabad | చెప్పకుండా పుట్టింటికి వెళ్లిందని.. భార్యను హత్యచేశాడు..

Hyderabad | చెప్పకుండా పుట్టింటికి వెళ్లిందని.. భార్యను హత్యచేశాడు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | సమాజంలో నేర స్వభావం నానాటికి పెరుగుతోంది. ఇటీవల చిన్న చిన్న కారణాలతో కూడా హత్యలు, దాడులు చేస్తున్నారు. క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్​ నగరంలోని రెహమత్‌నగర్‌లో (Rehmatnagar, Hyderabad) దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చెప్పకుండా పుట్టింటికి వెళ్లిందని భార్యను హత్య చేశాడు.

రెహమత్​నగర్​లో నివాసం ఉండే నరసింహను మొదటి భార్య వదిలేసింది. దీంతో ఏడేళ్ల క్రితం సోనీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే సోనీ ఇటీవల పుట్టింటికి వెళ్లింది. తనకు చెప్పకుండా వెళ్లిందనే కోపంతో నరసింహ సోనీని చితకబాదాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సోనీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు (Police registered a case Accuse) నరసింహను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad | సమాజం ఎటు పోతుంది

ఇటీవల జరుగుతున్న హత్యలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. కొందరు ప్రియుడి కోసం కట్టుకున్న వాడినే కడతేరుస్తున్నారు. మరికొందరు ప్రియురాలి మోజులో భార్యను చంపుతున్నారు. ఇటీవల జీడిమెట్​లో (Hyderabad, Jeedimetla) ఓ పదో తరగతి బాలిక తన లవర్​ కోసం ఏకంగా తల్లినే హత్య చేయించింది. ప్రస్తుతం నేరాలు పెరుగుతుండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు హత్యలు, ఆత్మహత్యలకు వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు కారణం అవుతుండడం గమనార్హం. ముఖ్యంగా యువత నేరాలకు పాల్పడుతుండడంతో వారి భవిష్యత్​ నాశనం అవుతోంది.