Homeజిల్లాలునిజామాబాద్​Pothangal | ఆపరేషన్​ సిందూర్​పై అనుచిత వ్యాఖ్యలు: బీజేపీ నాయకుల ధర్నా

Pothangal | ఆపరేషన్​ సిందూర్​పై అనుచిత వ్యాఖ్యలు: బీజేపీ నాయకుల ధర్నా

ఆపరేషన్​ సింధూర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. పోతంగల్​ మండల కేంద్రంలో ధర్నా చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Pothangal | పోతంగల్​ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్​) మాట్లాడుతూ.. ఓ వర్గం వ్యక్తులు ఆపరేషన్​ సిందూర్​పై (Operation Sindoor) అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు మండల కేంద్రంలో ఆదివారం ధర్నా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Pothangal | సీఎం రేవంత్​రెడ్డి క్షమాపణ చెప్పాలి

140 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని సైనం నిద్రహారాలు మాని.. ప్రాణాలకు తెగించి కాపాడుతుంటే దేశంలోనే ఓ వర్గం వ్యక్తులు వారి సేవలను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని వారు స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) వెంటనే త్రివిధ దళాలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓమన్నపటేల్​, విజయ్, సాయి కృష్ణ, శంకర్, దిగంబర్ పటేల్, రమేష్, కుమ్మరి లక్ష్మణ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.