Homeబిజినెస్​Stock Market | మూడో రోజూ నష్టాల్లోనే..

Stock Market | మూడో రోజూ నష్టాల్లోనే..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఉదయం భారీ పతనం దిశగా సాగిన సూచీలు.. తర్వాత కోలుకుని స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 94 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ప్రారంభమై భారీ పతనం దిశగా సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets).. తర్వాత పుంజుకున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 161 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 480 పాయింట్లు పడిపోయింది.

అక్కడినుంచి కోలుకుని క్రమంగా 720 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 76 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 115 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో పుంజుకుని 239 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 94 పాయింట్ల నష్టంతో 83,216 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 25,492 వద్ద స్థిరపడ్డాయి.

మెటల్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్ల మద్దతు..

టెలికాం(Telecom), ఐటీ సెక్టార్ల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవగా.. మెటల్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్ల మద్దతుతో బెంచ్‌మార్క్‌ సూచీలు కోలుకున్నాయి. బీఎస్‌ఈలో మెటల్‌(Metal) ఇండెక్స్‌ 1.41 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 1.04 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.74 శాతం, కమోడిటీ 0.60 శాతం, ఆటో 0.55 శాతం, పీఎస్‌యూ 0.50 శాతం లాభపడ్డాయి. టెలికాం ఇండెక్స్‌ 1.19 శాతం, పవర్‌ 0.52 శాతం, ఐటీ 0.50 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.45 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.44 శాతం, సర్వీసెస్‌ ఇండెక్స్‌ 0.37 శాతం పడిపోయాయి. మిడ్‌ క్యాప్‌(Mid cap) ఇండెక్స్‌ 0.30 శాతం పెరగ్గా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.01 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.02 శాతం నష్టపోయాయి.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,069 కంపెనీలు లాభపడగా 2,105 స్టాక్స్‌ నష్టపోయాయి. 141 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 132 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 209 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 12 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ఉండగా.. 15 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 2.40 శాతం, టాటా స్టీల్‌ 2.37 శాతం, ఎంఅండ్‌ఎం 2.03 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.96 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.69 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎయిర్‌టెల్‌ 4.46 శాతం, టెక్‌ మహీంద్రా 1.91 శాతం, రిలయన్స్‌ 1.17 శాతం, ట్రెంట్‌ 1.15 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.92 శాతం నష్టపోయాయి.

Must Read
Related News