- Advertisement -
Homeబిజినెస్​Stock Market | మూడో రోజూ నష్టాల్లోనే..

Stock Market | మూడో రోజూ నష్టాల్లోనే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | భారత్‌, యూఎస్‌ మధ్య వాణిజ్య చర్చలలో అనిశ్చితితోపాటు అమెరికా హెచ్‌1 బీ వీసా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిసింది. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 12 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైనా వెంటనే కోలుకుని 160 పాయింట్లు పెరిగింది.

ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాలనుంచి 531 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 2 పాయింట్ల లాభంతో ప్రారంభమై 41 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 166 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాలనుంచి కోలుకుని సెన్సెక్స్‌ 594 పాయింట్లు, నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి కొద్దిసేపు లాభాల్లో కొనసాగాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 67 పాయింట్ల నష్టంతో 82,102 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 25,169 వద్ద్ద స్థిరపడ్డాయి.

- Advertisement -

ఎఫ్‌ఎంసీజీలో అమ్మకాల ఒత్తిడి..

ఎఫ్‌ఎంసీజీ, రియాలిటీ, ఐటీ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడికి గురవగా.. పీఎస్‌యూ(PSU), మెటల్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.01 శాతం, మెటల్‌ 0.97 శాతం, బ్యాంకెక్స్‌ 0.69 శాతం, ఆటో ఇండెక్స్‌ 0.61 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.48 శాతం పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌(FMCG index) 1.28 శాతం, రియాలిటీ 0.89 ఐటీ 0.72 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.66 శాతం, హెల్త్‌కేర్‌ 0.44 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 0.46 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.29 శాతం, లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.16 శాతం నష్టాలతో ముగిశాయి.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,798 కంపెనీలు లాభపడగా 2,356 స్టాక్స్‌ నష్టపోయాయి. 157 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 173 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 66 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో ఉండగా.. 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 2.32 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.94 శాతం, మారుతి 1.83 శాతం, ఎస్‌బీఐ 1.81 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 1.55 శాతం లాభపడ్డాయి.

Top Losers : ట్రెంట్‌ 2.34 శాతం, టెక్‌ మహీంద్రా 2.07 శాతం, హెచ్‌యూఎల్‌ 1.94 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.90 శాతం, ఆసియా పెయింట్‌ 1.42 శాతం నష్టపోయాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News