Homeబిజినెస్​Stock Market | రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు

Stock Market | రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 297 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయాయి.

యూఎస్‌, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య అనిశ్చిత పరిస్థితులతో గ్లోబల్‌ మార్కెట్లు(Global Markets) నెగెటివ్‌గా ట్రేడ్‌ అయ్యాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించింది. ఉదయం లాభాలతో ప్రారంభమైనా కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టాలలోకి జారుకున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 77 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 50 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. లాభాలతో ప్రారంభమైనా సూచీలు ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోయాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగాయి. సెన్సెక్స్‌ 81,781 నుంచి 82,573 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,060 నుంచి 25,310 పాయింట్ల మధ్యలో ట్రేడ్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 297 పాయింట్ల నష్టంతో 82,029 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 25,145 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి..

బీఎస్‌ఈలో క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ మినహా అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌(PSU bank index) 1.62 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ 1.13 శాతం, పీఎస్‌యూ 1.02 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 1.01 శాతం, రియాలిటీ 0.96 శాతం, మెటల్‌ 0.95 శాతం, కమోడిటీ 0.88 శాతం, సర్వీసెస్‌ ఇండెక్స్‌ 0.87 శాతం, ఇన్‌ఫ్రా 0.76 శాతం, ఇండస్ట్రియల్‌ ఇండెక్స్‌ 0.71 శాతం నష్టపోయాయి. క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ మాత్రమే 0.49 శాతం లాభంతో ముగిసింది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.95 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.74 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.40 శాతం క్షీణించాయి.

Stock Market | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,337 కంపెనీలు లాభపడగా 2,870 స్టాక్స్‌ నష్టపోయాయి. 127 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 133 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 153 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 3.6 లక్షల కోట్లు ఆవిరయ్యింది.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్‌ మహీంద్రా 1.25 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.36 శాతం, పవర్‌గ్రిడ్‌ 0.33 శాతం, హెచ్‌యూఎల్‌ 0.31 శాతం, రిలయన్స్‌ 0.04 శాతం పెరిగాయి.

Top Losers : బజాజ్‌ ఫైనాన్స్‌ 1.80 శాతం, బీఈఎల్‌ 1.76 శాతం, టాటా స్టీల్‌ 1.71 శాతం, టీసీఎస్‌ 1.56 శాతం, ఎన్టీపీసీ 1.40 శాతం నష్టపోయాయి.