Homeబిజినెస్​Stock Market | రెండోరోజూ నష్టాల్లోనే..

Stock Market | రెండోరోజూ నష్టాల్లోనే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి.

బుధవారం ఉదయం 94 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో గరిష్టంగా 307 పాయింట్లు నష్టపోయింది. 6 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 89 పాయింట్లు పడిపోయింది. ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోలు చేస్తూ గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు దిగుతుండడంతో మార్కెట్లు రోజంతా రేంజ్‌ బౌండ్‌లోనే కొనసాగాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 239 పాయింట్ల నష్టంతో 81,312 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 24,752 వద్ద స్థిరపడ్డాయి.


బీఎస్‌ఈ(BSE)లో 2,022 కంపెనీలు లాభపడగా 1,928 స్టాక్స్‌ నష్టపోయాయి. 156 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 98 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 32 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌(Lower circuit)ను తాకాయి.

Stock Market | టెలికాం, పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో దూకుడు..

టెలికాం(Telecom), పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు ర్యాలీ తీశాయి. బీఎస్‌ఈ టెలికాం ఇండెక్స్‌ 1.38 శాతం మేర పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఒక శాతం లాభపడింది. పీఎస్‌యూ(PSU), క్యాపిటల్‌ గూడ్స్‌ వంటి సూచీలు లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ సూచీ 1.38 శాతం తగ్గగా.. మెటల్‌ ఇండెక్స్‌ 0.70 శాతం, కన్జూమర్‌ గూడ్స్‌ సూచీ 0.66 శాతం, ఆటో ఇండెక్స్‌ 0.64 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.47 శాతం లాభపడగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.28 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.26 శాతం నష్టాలతో ముగిశాయి.

Stock Market | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌(Bajaj finance) 1.07 శాతం పెరగ్గా.. ఎయిర్‌టెల్‌ 0.65 శాతం లాభపడిరది. ఐసీఐసీఐ బ్యాంక్‌, అదాని పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్టీపీసీ లాభాలతో ముగిశాయి.

Stock Market | Top losers..

ఐటీసీ(ITC) అత్యధికంగా 3.18 శాతం పడిపోగా.. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1.99 శాతం, నెస్లే 1.78 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.62 శాతం, ఎంఅండ్‌ఎం 1.41 శాతం నష్టపోయాయి.