అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | యూఎస్ హెచ్ 1బీ వీసా ఫీజు పెంపును ఐటీ కంపెనీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దాని ప్రభావంనుంచి కోలుకోవడం లేదు. గురువారం ఆటో, పవర్ షేర్లూ తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market) వరుసగా ఐదో సెషన్లోనూ నష్టాలనే చవిచూసింది.
గురువారం ఉదయం సెన్సెక్స్ 141 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 22 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకు స్వల్ప ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు.. చివరి గంటన్నరలో భారీగా పతనమయ్యాయి. జపాన్ నిక్కీ మినహా మిగిలిన ప్రధాన గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో పయనించడంతో వాటి ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించింది. చివరికి సెన్సెక్స్(Sensex) 555 పాయింట్ల నష్టంతో 81,159 వద్ద, నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 24,890 వద్ద్ద స్థిరపడ్డాయి.
Stock Market | ఐటీ, పవర్ సెక్టార్లలో సెల్లాఫ్..
ఐటీ(IT), ఆటో, పవర్, ఇన్ఫ్రా సెక్టార్ల స్టాక్స్ సెల్లాఫ్‌కు గురయ్యాయి. బీఎస్ఈలో టెలికాం 0.34 శాతం, మెటల్ ఇండెక్స్ 0.17 శాతం పెరిగాయి. రియాలిటీ ఇండెక్స్ 1.70 శాతం, పవర్(Power) 1.38 శాతం, ఐటీ 1.23 శాతం, యుటిలిటీ 1.21 శాతం, ఆటో 0.93 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 1.07 శాతం, హెల్త్ కేర్ 0.70 శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.59 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.58 శాతం పడిపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.75 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.72 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.72 శాతం నష్టాలతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,474 కంపెనీలు లాభపడగా 2,709 స్టాక్స్ నష్టపోయాయి. 157 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 137 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 94 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 17 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 17 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 4.10 లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 కంపెనీలు లాభాలతో ఉండగా.. 27 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 2.05 శాతం, ఎయిర్టెల్ 0.31 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.28 శాతం లాభపడ్డాయి.
Top Losers : ట్రెంట్ 3.19 శాతం, పవర్‌గ్రిడ్ 3.05 శాతం, టాటా మోటార్స్ 2.71 శాతం, టీసీఎస్ 2.50 శాతం, అసియా పెయింట్ 2.23 శాతం నష్టపోయాయి.