HomeUncategorizedHyderabad | హైదరాబాద్​లో కి‘లేడీ’లు.. ఏకంగా పోలీసులకే బ్లాక్​మెయిలింగ్​

Hyderabad | హైదరాబాద్​లో కి‘లేడీ’లు.. ఏకంగా పోలీసులకే బ్లాక్​మెయిలింగ్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad | ఒంటరిగా ఉన్నామని చెబుతారు.. ఒక్క కాల్​​ చేసుకుంటామని ఫోన్​ అడుగుతారు. కొద్దిదూరం లిఫ్ట్​ కావాలని కోరుతారు. తీరా మాయ లేడీలను నమ్మి వారితో మాటలు కలిపేమాంటే చాలు..! మనల్నే బ్లాక్​మెయిల్​ (blackmail) చేస్తారు. హైదరాబాద్​ నగరంలో (hyderabad city) ఇటీవల ఇటువంటి ఘటనలు తరుచు చోటు చేసుకుంటున్నాయి.

Hyderabad | ఒంటరిగా కలవాలని చెప్పి ..

కొందరు మహిళలు ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుంటారు. బైక్​పై లిఫ్ట్​ (bike lift) అడిగి మాట కలుపుతారు. తర్వాత ఫోన్​ నంబర్​ (phone number) తీసుకొని చాటింగ్​ చేస్తారు. అనంతరం ఒంటరిగా కవాలని కోరుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక డబ్బులు డిమాండ్​ చేస్తారు. లేదంటే తమపై అత్యాచారయత్నం చేశారని కేసులు (cases) పెడతామని బెదిరిస్తారు. అంతేగాకుండా పలువురు లిఫ్ట్​ అడిగి వాహనదారుల ఫోన్లు, పర్సులు (phones and wallets) కొట్టేస్తారు. ఏమైనా అంటే అల్లరి చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Hyderabad | మోసపోయిన కానిస్టేబుల్​

సికింద్రాబాద్​లో (secunderabad) ఇటీవల ఓ కానిస్టేబుల్​ (constable) ఇలాండి కీలేడీల చేతిలో మోసపోయాడు. ఆయన నుంచి ఓ యువతి రూ.లక్ష కాజేసింది. వరంగల్‌కు చెందిన ఓ యువతి ముఖ్యంగా కానిస్టేబుళ్లు, హోంగార్డులే (constables and home guards) లక్ష్యంగా మోసాలకు పాల్పడేది. ‘‘మీ ఫోన్‌ ఇస్తే మా వాళ్లకు చేసుకుంటానని’’ మాట కలిపేది. అనంతరం వారి నంబర్​ తీసుకొని చాటింగ్​ చేసి మాటాల్లో పెట్టేది. ఇలాగే ఇటీవల కానిస్టేబుల్‌ను బెదిరించి రూ.లక్ష కాజేసింది. మరో మరో కానిస్టేబుల్‌నూ మోసం చేయాలని యత్నించగా పోలీసులకు చిక్కింది. యువతిపై కేసు నమోదు (case registered) చేసి అరెస్టు చేశారు. ఇలాంటి వారు చాలా మంది నగరంలో ఉన్నట్లు పోలీసులు (police) గుర్తించారు. వీరిలో చేతిలో మోసపోయిన చాలా మంది ఎక్కడ పరువు పోతుందోనని పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు.