అక్షరటుడే, వెబ్‌డెస్క్: Run Out : క్రికెట్ చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన రనౌట్స్ చూశాం. కానీ తాజాగా ఓ లోకల్ టెన్నిస్ బాల్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ విచిత్ర రనౌట్ మాత్రం అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా, క్రికెట్ అభిమానులు నవ్వుతూ, ఇలాంటిది ఇంకెప్పుడూ చూడము” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఓ స్థానిక టెన్నిస్ బాల్ టోర్నీలో Tennis Ball బ్యాటర్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్ దిశగా బంతిని ఆడి, క్విక్ సింగిల్ కోసం పరుగు తీశాడు. ఫీల్డర్ వెంటనే బంతిని వికెట్ కీపర్ వైపు విసిరాడు.
Run Out : ఫన్నీ రనౌట్
అయితే బంతి ఎత్తుగా వెళ్లడంతో వికెట్ కీపర్ దాన్ని జంప్ చేసి పట్టే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో బంతి అతని గ్లోవ్స్‌కు తాకి నిదానంగా నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు వెళ్లింది. అయితే వికెట్ కీపర్
Wicket Keeper కిందపడిపోవడంతో ఇద్దరు బ్యాటర్లు సులువుగా పరుగు పూర్తిచేశారు.
కానీ ఇక్కడే ట్విస్ట్! నాన్-స్ట్రైకర్ బ్యాటర్ క్రీజ్‌లోకి పరుగెత్తి వచ్చి, తన కాళ్ల మధ్యగా వస్తున్న బంతిని గమనించకుండా క్రీజ్ దాటి రెండో రన్‌కి ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. బెయిల్స్ పడిపోయాయి. వెంటనే ఫీల్డింగ్ టీమ్ అప్పీల్ చేయగా, అంపైర్ రనౌట్ ప్రకటించాడు.
ఈ విచిత్ర రనౌట్ వీడియోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విటర్) లో రిచర్డ్ కెటిల్‌బరో అనే పాపులర్ ఫ్యాన్ అకౌంట్ షేర్ చేసింది. వీడియోలో బ్యాటర్‌కి ఏమీ అర్థం కాక బిత్తరగా చూస్తూ పెవిలియన్ చేరడం, ఫీల్డింగ్ టీమ్ నవ్వుతూ సెలబ్రేట్ చేసుకోవడం మనం చూడవచ్చు.
ఈ వీడియోని చూసిన నెటిజన్స్.. ఇది క్రికెట్ చరిత్రలోనే అతి దురదృష్టకరమైన రనౌట్, ఇంకా 100 ఏళ్లైనా ఇలాంటిది చూడం, బంతి తనను వెంబడించిందనుకోవాలి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో షేర్ చేసిన ఎక్స్ అకౌంట్ పేరు రిచర్డ్ కెటిల్‌బరో అయినా, అది నిజమైన ICC అంపైర్ కెటిల్‌బరోది కాదు. భారత్‌లో ఈ అంపైర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఎందుకంటే అతను అంపైర్‌గా వ్యవహరించిన చాలా నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోయింది. దీంతో కొంతమంది అభిమానులు అతన్ని “వరస్ట్ అంపైర్” “worst umpire” అని పిలుస్తుంటారు.