అక్షరటుడే, ఇందూరు:Care Degree College | నగరంలోని ‘కేర్’ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఫేర్వెల్ పార్టీని(Farewell celebrations) ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు(Students) ఆటపాటలతో అలరించారు. డ్యాన్స్ మాస్టర్లు వినయ్, అమృత్ శిష్య బృందం చేసిన నృత్యాలు(Dances) ఆహుతులను అలరించాయి. కూచిపూడి మాస్టర్ శ్రీనివాస్ శిష్యులు స్వాగత నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అంతకుముందు పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, ప్రిన్సిపాల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ నరేశ్, కొయ్యాడ శంకర్, సందేష్, సందీప్, శ్రీనివాస్, నిసార్ అలి, మినాజ్ తదితరులు పాల్గొన్నారు.
