అక్షరటుడే నిజాంసాగర్: Wrestling Competitions | నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో సోమవారం కుస్తీపోటీలు అలరించాయి. ఉత్సాహపూరిత వాతావరణంలో పోటీలు జరిగాయి.
నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర (Maharashtra) ప్రాంతాలతో పాటు సంగారెడ్డి (Sangareddy), మెదక్ (Medak) నుంచి మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను తిలకించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. విజేతలకు నిర్వాహకులు పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ బహుమతులు అందజేశారు. నాయకులు గుర్రం శ్రీనివాస్ పటేల్, మేంగారం శ్రీనివాస్‌తో పాటు గ్రామపెద్దలు, ఆలయ కమిటీ నిర్వాహకులు, జాతర నిర్వాహకులు పాల్గొన్నారు.

విజేతకు నగదు బహుమతిని అందజేస్తున్న పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చోకోటి మనోజ్‌కుమార్