అక్షరటుడే, ఎల్లారెడ్డి: Wrestling competitions | లింగంపేట మండలం ఐలాపూర్‌లో దుర్గమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం కుస్తీ పోటీలు (wrestling competitions) నిర్వహించారు. పోటీల్లో తలపడేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, జుక్కల్, బాన్సువాడ, పిట్లం, గాంధారి, తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. పోటీలు చూసేందుకు జనం కూడా అధికసంఖ్యలో వచ్చారు. విజేతకు మూడు తులాల వెండి కడియం బహుమతిగా అందజేశారు.
నిజాంసాగర్‌లో..

అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని వడ్డేపల్లిలో నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి తలపడ్డారు. పోటీలు ఆద్యంతం అలరించాయి. విజేతకు రూ.3వేల నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు, గ్రామపెద్దలు ప్రజాపండరి, అంజయ్య, రాజారాం, మోహన్ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
