అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahanadu | మహానాడులో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఏపీ(AP)లోని కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు ప్రారంభమైంది. ఎన్టీఆర్ జయంతి(NTR birthday) సందర్భంగా టీడీపీ నాయకులు ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏఐ వీడియో(AI Video) ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించిన టీడీపీ నాయకులు మహానాడులో ప్రదర్శించారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన అందులో పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
