అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Uttam Kumar Reddy | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. బర్ధిపూర్ సభలో ఆయన మాట్లాడారు. ఉచిత ఆర్టీసీ బస్సు, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
Minister Uttam Kumar Reddy | కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం
గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ మంజూరు చేయలేదని విమర్శించారు. కానీ తాము వచ్చాక కొత్త కార్డులు ఇచ్చామన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (Nizamabad Municipal Corporation) గత ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల రేషన్ కార్డులు ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక మరో 65వేల మంది లబ్ధిదారులకు కార్డులు మంజూరు చేశామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 లక్షల మందికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే వారికి కూడా రేషన్ కార్డులు ఇస్తామన్నారు. నిజామాబాద్ చైతన్యవంతమైన జిల్లా అని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఎంతో మంది ప్రముఖ నేతలు ఉన్నారన్నారు.
ఏడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం
నిజామాబాద్ జిల్లాలో వరి ఎక్కువగా సాగు అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2023 ఖరీఫ్‌లో 4.20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే.. తమ ప్రభుత్వం ఏడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని వివరించారు. ఇరిగేషన్లో ప్యాకేజీ నం. 21ఏ పనులు ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. పనులను త్వరగా పూర్తి చేసి మరో రెండు లక్షల ఎకరాలకు నీటిని అందిస్తామన్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనేది గుర్తించాలన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.