అక్షరటుడే, వెబ్డెస్క్ : America | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ సారి ఓ మహిళపై ఇమ్మిగ్రేషన్ అధికారులు (Immigration Officers) ఫైరింగ్ చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
అమెరికాలో ఇటీవల అధికారులు అక్రమ వలసదారులను గుర్తించడానికి తనిఖీలు చేస్తున్నారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. అయితే మిన్నియాపోలీస్ (Minneapolis)లో సోదాలు చేస్తుండగా ఓ మహిళ కారులో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించింది. దీంతో అధికారులు కాల్పులు జరపగా.. రెనీ నికోల్ గుడ్ (37) అనే మహిళపై చనిపోయింది. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
America | ఆత్మ రక్షణ పేరిట..
మిన్నియాపాలిస్ నగరంలో US ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ 37 ఏళ్ల మహిళను కాల్చి చంపాడు. ఇది ఆత్మరక్షణ అని ట్రంప్ పరిపాలన చేసిన వాదనను స్థానిక అధికారులు తిరస్కరించారు. సదరు మహిళ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Customs Enforcement) ఏజెంట్లను ఢీకొట్టడానికి ప్రయత్నించిందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. మిన్నియాపాలిస్ మేయర్ జాకబ్ ఫ్రే మాట్లాడుతూ సదరు ఏజెంట్ తన అధికారాన్ని నిర్లక్ష్యంగా ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహిళ చనిపోయిందన్నారు. ICE అధికారులు నగరాన్ని విడిచి వెళ్లాలని పేర్కొన్నారు. కాగా మహిళపై కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్గా మారింది. ఆమెను పట్టుకునే అవకాశం ఉన్నా.. సదరు అధికారి కాల్పులు జరిపినట్లు వీడియోలో కనిపిస్తోంది.మిన్నియాపాలిస్ నివాసితులు కొందరు కాల్పులను ఖండించారు. ఐసీఈ అధికారులు తమ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆందోళనలు చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.