అక్షరటుడే, ఎల్లారెడ్డి: Compensation | వరదలు సంభవించి రెండువారాలు గడిచినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేదని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Former MLA Jajala Surender) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడ్వాయి మండల (Tadwai mandal) సంతాయిపేట్ గ్రామంలో భారీ వరదలకు (heavy floods) కొట్టుకుపోయిన పంట పొలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాలకు రూ.లక్ష పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
ఎండ్రియల్ గ్రామంలో (Endrial village) భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. సంతాయిపెట్, చిట్యాల, ఎండ్రియల్ గ్రామాల్లో వరద బీభత్సానికి వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేసిందని.. రాళ్లు మట్టి పేరుకుపోయాయన్నారు. కాని ప్రజాప్రతినిధుల నుంచి స్పందన లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విపత్తు వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.లక్ష సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం దేమే గ్రామంలో గతంలో తన వద్ద పనిచేసిన గన్‌మన్ నవీన్ గారి తండ్రి ఇటీవల మృతిచెందగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా ఆ గ్రామ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ (former BRS sarpanch) సంగారావు నానమ్మ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కరడ్‌పల్లి గ్రామ బీఆర్ఎస్ కార్యకర్త గొల్ల చంద్రయ్య గారి తల్లి ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చందాపుర్ గ్రామ మాజీ సర్పంచ్ గంగారెడ్డి సతీమణి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయనను ఓదార్చారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో కొన్ని రోజుల క్రితం మరణించిన పైడాకుల నారాయణ, బొంది చిన్న లింగం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.