అక్షరటుడే, వెబ్‌డెస్క్ : I Bomma | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదు… ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐబొమ్మ రవి పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఆన్‌లైన్‌లో కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను ఉచితంగా అందిస్తూ కోట్లాది మందిని ఆకర్షించిన iBomma ,Bappam TV వెబ్‌సైట్ల ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం పెద్ద చర్చనీయాంశమైంది.
కొంతకాలంగా కరీబియన్ దీవుల్లో ఉంటూ ఆఫ్‌షోర్ సర్వర్ల ద్వారా భారీ పైరసీ నెట్‌వర్క్ ను నడిపిన రవి… ఇటీవల తన భార్యకు డైవోర్స్ ఇచ్చేందుకు హైదరాబాద్ (Hyderabad)కు రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.. భార్య ఇచ్చిన సమాచారంతో, సీసీఎస్ పోలీసులు (CCS Police) ప్రత్యేకంగా వల పన్ని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
I Bommaఅది చాలా తప్పు..
అరెస్టు అనంతరం పోలీసులు జరిపిన విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అదే క్రమంలో ‘iBomma’ , ‘Bappam TV’ వెబ్‌సైట్లను రవితోనే శాశ్వతంగా క్లోజ్ చేయించారు. విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవి, చిన్నతనం నుంచే సైబర్ టెక్నాలజీపై విపరీతమైన ఆసక్తి చూపేవాడు. తొలుత చిన్న స్థాయిలో పైరసీ (Piracy) చేయడం ప్రారంభించిన రవి… తరువాత iBomma, Bappam వంటి పెద్ద వెబ్‌సైట్లను నిర్మించి తెలుగు, తమిళం, హిందీ మాత్రమే కాక… పలు భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్‌ను అక్రమంగా అప్‌లోడ్ చేస్తూ వరుస విజయాలు సాధించాడు. తన నెట్‌వర్క్‌ను ఎవరూ ట్రేస్ చేయలేకుండా ఉండేందుకు ఫ్రాన్స్, కరీబియన్ దీవులు, యూరోప్ దేశాల్లోని ఆఫ్‌షోర్ సర్వర్ల ద్వారా మొత్తం ఆపరేషన్స్ నడిపేవాడు.
ఇటీవల అతని వ్యక్తిగత జీవితం లో సమస్యలు వచ్చి భార్యతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి.కొన్నేళ్లుగా దూరంగా ఉన్నా… డైవోర్స్ విషయంపై ఇటీవల భారత్‌కు రావడం రవికి ప్రమాదమైంది. అదే విషయాన్ని పోలీసులు ఉపయోగించుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.అయితే విశాఖలో ఉండే రవి తండ్రి అప్పారావు మీడియాతో మాట్లాడుతూ .. నా కొడుకు ఇలాంటి పనులు చేస్తున్నాడని నాకు తెలియదు. ప్రభుత్వాన్ని, పోలీసులను సవాల్ చేయడం పెద్ద తప్పే. తాము కష్టపడి జీవిస్తాం. అతడు తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుని, తిరిగి విడిపోయాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) రవిని ఈ రోజు కోర్టులో హాజరు పరచనున్నారు. అతడి నెట్‌వర్క్‌లో ఉన్న మరికొందరిపై కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.
