HomeUncategorizedIMF Helps $1 billion to Pakistan | పాకిస్తాన్‌కు IMF వన్​ బిలియన్ డాలర్ల...

IMF Helps $1 billion to Pakistan | పాకిస్తాన్‌కు IMF వన్​ బిలియన్ డాలర్ల రుణం.. భారత్ అభ్యంతరం

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: IMF provide $1 billion to Pakistan : పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) వన్​ బిలియన్ డాలర్ల రుణం వెంటనే మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ప్రస్తుతం అమలులో ఉన్న ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) లో భాగంగా ఇవ్వబోతోంది. కాగా, దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిధులను పాక్​ ఉగ్రవాదానికి మళ్లించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఇక పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేశారు. “దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది. మనం అభివృద్ధి దిశగా పయనిస్తాం” అని షరీఫ్ పేర్కొన్నారు.

కాగా, పాకిస్తాన్ కోసం IMF మరో కొత్త రకాల రుణ పథకం (రెసిలియన్స్ & సస్టైనబిలిటీ ఫెసిలిటీ RSF) కింద $1.3 బిలియన్ డాలర్లు విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

IMF provide $1 billion to Pakistan : భారత్ అభ్యంతరం..

IMF బోర్డు సమావేశంలో భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. గతంలో IMF నిధులను పాకిస్తాన్ తప్పుడు విధంగా వాడిన దృష్ట్యా, తాజా సహాయం కూడా దుర్వినియోగానికి గురయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ నిధులను సరిహద్దు ఉగ్రవాదానికి వినియోగించనుందని పేర్కొంది.

Must Read
Related News