అక్షరటుడే, కామారెడ్డి: Rajampet mandal | రాజంపేట మండలంలోని పలు తండాల్లో వరద బాధితులకు ఐఎంఏ బాసటగా (IMA Support) నిలిచింది. మండలంలోని నడిమితండా, లేత మామిడి తండా, ట్యాంక్ తండా, ఎల్లపూర్ తండా, ధరణికుంట తండాల్లో జీవధాన్ ఆస్పత్రి, ఐఎంఏ సహకారంతో బియ్యం, పప్పులు, దుస్తులు, దుప్పట్లు ఇతరత్రా నిత్యావసర సరుకులను ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరద బీభత్సానికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తమవంతుగా సహాయం అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డా అరవింద్ గౌడ్, కోశాధికారి డా పవన్, సోషల్ యాక్టివిస్ట్ స్వర్ణలత, జీవధాన్ వైద్యులు అజయ, దీప, ఇతర బృందం సభ్యులు పాల్గొన్నారు.