81
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ (Flying Squad Team) పట్టుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి బృందం సభ్యులు వివరాలు వెల్లడించారు.
ఎల్లారెడ్డి మండలంలోని మల్లయ్యపల్లి గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా పాపన్నపేట్ మండలం పాత లింగయ్య పల్లి గ్రామానికి చెందిన చింతకాయల రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 25 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని.. అనంతరం ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో (Yellareddy Police) ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని వారు తెలిపారు.