అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | గడ్డిమందుతో భూమికి, ప్రజలకు ముంపు పొంచి ఉంది. అందులోనూ గడ్డిమందు మరింత ప్రమాదకరం. అయినా ఫర్టిలైజర్లు దుకాణాల్లో (Fertilizers shop) దొంగచాటుగా విక్రయిస్తున్నారు. డీలర్లు ఇష్టారాజ్యంగా నిషేధిత గడ్డి మందులు అమ్ముతున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఫారెస్ట్ అధికారులు పంట పొలాలపై వాడకూడని గడ్డి మందును ఓ రైతు పొలంలో చల్లడం తీవ్ర చర్చకు దారి తీసింది.
పొలంలో, గట్ల మీద గడ్డితో పంట దిగుబడి తగ్గుతుంది. దీంతో రైతులు (Farmers) గడ్డి మందులు వినియోగిస్తారు. అయితే గడ్డి మందుతో భూమితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇందులో కొన్ని మందులు మరింత ప్రమాదకరం. వీటిని అవసరం మేరకు మాత్రమే వాడాలని, తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఇతర మందులు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే ప్రభుత్వ ఆదేశాలను వ్యాపారులు పట్టించుకోవడం లేదు. గడ్డిమందును చాలా మంది రైతులు వినియోగిస్తారు. దీంతో దొంగచాటుగా డీలర్లు విక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా డబ్బులు తీసుకొని డబ్బాలు ఇస్తున్నారు. ఎవరైనా అడిగినా.. తమ వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పొద్దని రైతులకు సూచిస్తున్నారు.
Kamareddy | అధికారుల అనుమతి తప్పనిసరి..?
వ్యవసాయ భూముల్లో గడ్డి మందు పిచికారి నిషేధం. అయినా గ్రామాల్లో ఇంటి పరిసరాల్లో పెరిగిన గడ్డిని తొలగించేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతించింది. అయితే గడ్డిమందు అవసరమైన వారు స్థానిక వ్యవసాయ అధికారి (local agricultural officer) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి ఉంటేనే డీలర్లు గడ్డిమందు విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు.
Kamareddy | రైతు పొలంలో చల్లిన అధికారులు
వ్యవసాయ పొలాలపై వాడొద్దని ఆదేశాలున్న గడ్డిమందును ఫారెస్ట్ అధికారులు (Forest officials) కొనుగోలు చేశారు. అంతేగాకుండా అటవీ భూమిలో పంట సాగు చేశారని రైతుల పొలంలో దానిని పిచికారీ చేశారు. నిషేధిత మందును కొనుగోలు చేయడమే కాకుండా.. పొలంలో చల్లడంతో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
గాంధారి మండలం (Gandhari mandal) సీతాయిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు అటవీ భూమిలో సాగు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ పొలంలో గడ్డి మందు పిచికారీ చేశారు. గడ్డి మందు చల్లితే పొలం పాడువుతుంది. దీంతో సదరు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అధికారులు అటవీ శాఖ అధికారులపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Kamareddy | పర్యవేక్షణ కరువు
ఎరువులు, విత్తనాలు విక్రయించే వ్యాపారులు, డీలర్లపై వ్యవసాయ అధికారుల నిఘా కొరవడింది. ఇటీవల కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతుకు కాలం చెల్లిన గడ్డి మందును వ్యాపారులు విక్రయించారు. ఎరువులు, పురుగు మందు దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేయడం లేదు. వ్యాపారుల వద్ద మామూళ్లు తీసుకుంటూ వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నిషేధిత గడ్డి మందు కొనుగోలు చేయడంతో పాటు రైతు పొలంపై పిచికారీ చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
గడ్డి మందు విక్రయాలపై నిషేధం లేదు
-మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
గడ్డి మందు విక్రయాలపై ఎలాంటి నిషేధం లేదు. లేబుల్ క్లెయిమ్ ప్రకారం మాత్రమే విక్రయించాలి. ఆ మందు దేనికి ఉపయోగించాలి అనేది వ్యాపారులు రైతులకు స్పష్టంగా చెప్పాలి. పొలం చుట్టూ ఉన్న గడ్డి తొలగించడం కోసం మాత్రమే గడ్డి మందు వాడాలి. గాంధారి (Gandhari) మండలంలో రైతు పొలంపై అటవీశాఖ అధికారులు గడ్డి మందు పిచికారీ చేసిన విషయం మా దృష్టికి రాలేదు. పత్రికల్లో మాత్రమే చూస్తేనే మాకు తెలిసింది. ఫర్టిలైజర్ షాపులపై నిరంతర నిఘా ఉంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం