ePaper
More
    HomeతెలంగాణPaddy Bonus | ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతున్న ధాన్యం.. ఎందుకో తెలుసా?

    Paddy Bonus | ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతున్న ధాన్యం.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Bonus | ఆంధ్ర ప్రదేశ్​ AP నుంచి కొందరు దళారులు తెలంగాణ Telanganaకు అక్రమంగా ధాన్యం paddy తీసుకు వస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ congress​ అధికారంలోకి వచ్చాక సన్నవడ్లకు బోనస్​ ప్రకటించిన విషయం తెలిసిందే. క్వింటాలు​కు రూ.500 బోనస్​ అందజేస్తోంది. దీంతో ఆంధ్ర దళారులు అక్కడ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తెలంగాణ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి తీసుకు వస్తున్నారు. ఇక్కడ ధాన్యం అమ్మి బోనస్​ డబ్బులు కాజేయాలని చూస్తున్నారు.

    Paddy Bonus | ఏడు లారీల పట్టివేత

    ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ధాన్యం తీసుకు వస్తున్న ఏడు లారీలను శనివారం అధికారులు పట్టుకున్నారు. నల్గొండ nalgonda జిల్లా వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ వద్ద లారీలను సీజ్​ చేశారు. పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, ధాన్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    Paddy Bonus | సరిహద్దుల్లో చెక్​పోస్టులు

    బోనస్​ డబ్బుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చెక్​పోస్టులను ఏర్పాటు చేసింది. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వడ్ల లారీలు రాకుండా సరిహద్దుల్లో అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా పలువురు దళారులు అడ్డదారుల్లో ధాన్యం తీసుకువస్తున్నట్లు సమాచారం.

    Paddy Bonus | వారు సహకరిస్తేనే..

    కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతు పట్టాపాస్​బుక్​, బ్యాంకు ఖాతా జిరాక్స్​ తీసుకుంటారు. ఎకరాకు ఇన్ని బస్తాలు మాత్రమే కాంటా చేస్తారు. అయితే ఆంధ్ర నుంచి లారీలు తీసుకొచ్చిన దళారులకు రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సహకరిస్తేనే బోనస్​ డబ్బులు వస్తాయి. ఆ ధాన్యాన్ని ఇక్కడి రైతుల పేరుమీద విక్రయించినట్లు ట్రక్​షీట్​ రాస్తేనే డబ్బులు జమ అవుతాయి. దళారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై ధాన్యం తీసుకు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

    More like this

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...