అక్షరటుడే, కోటగిరి: illegal sand transportation | ఇందిరమ్మ ఇళ్ల Indiramma’s houses పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లను రైతులు Farmers అడ్డుకున్నారు.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం రైతులు, గ్రామస్తులు కలిసి టిప్పర్లను అడ్డుకుని రోడ్డుపైనే నిలిపేశారు.
పోతంగల్ మండలం కోడిచెర్ల మంజీరా సరిహద్దు Kodicherla Manjira border శివారులోని ఓ రైతు పొలంలో ఇసుక మేటలు తొలగించేందుకు, అనుమతులు తీసుకొని మరోచోటు నుంచి ఇసుక తోడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతుల పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పలను రైతులు అడ్డుకున్నారు.
illegal sand transportation | పట్టించుకోని అధికారులు..
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ఎకరాల పట్టా భూమిలో పర్మిషన్ పేరుతో అక్రమ ఇసుక రవాణా, హద్దు అదుపు లేకుండా తోడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోటగిరి, వర్ని, రుద్రూర్, చందూర్, మోస్రా మండలాలకు ట్రాక్టర్లతో ప్రతిరోజు ఇసుకను తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. టిప్పర్లకు పర్మిషన్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.
పర్మిషన్ పేరుతో ఓ రైతు పట్టా భూమి పేరుతో రూ. లక్షలలో వసూలు చేస్తున్నట్లు కర్షకులు ఆరోపించారు. అకాల వర్షాలు, పంట పొలాలలో దిగుబడి రాక రైతులు ఓ వైపు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో పంట పొలాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
