ePaper
More
    Homeక్రైంSp Rajesh Chandra | వివాహేతర సంబంధమే జీపీ కార్యదర్శి హత్యకు కారణం

    Sp Rajesh Chandra | వివాహేతర సంబంధమే జీపీ కార్యదర్శి హత్యకు కారణం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | వివాహేతర సంబంధమే పంచాయతీ కార్యదర్శి హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చిన్నకొడప్​గల్(Chinna Godapgal)​ గ్రామానికి చెందిన లింగంపేట మల్కయ్యకు వివాహమైంది. మల్కయ్య బతుకు దెరువు కోసం నాలుగునెలలు హైదరాబాద్​కు (Hyderabad) వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. అయితే తన భార్యతో పంచాయతీ కార్యదర్శి దారావత్​ కృష్ణకు (Panchayat Secretary Darawat Krishna) వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని తెలుసుకున్న మల్కయ్య నిత్యం భార్యతో గొడవపడేవాడు.

    అనంతరం కృష్ణను ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో తన భార్యతో ఈనెల 5న కృష్ణకు ఫోన్​ చేయించి ఇంటికి రప్పించారు. అక్కడ మరో ఇద్దరు ఎర్రన్నోళ్ల బాలరాజు, లింగంపేట మల్యయ్యతో కలిసి కృష్ణను గొడ్డలి, కత్తి, ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చారు. అనంతరం కృష్ణ మృతదేహాన్ని రెడ్డి చెరువులో పడేశారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించామని ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వస్తువులు, రెండు బైక్​లు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును త్వరగా ఛేదించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్​రెడ్డి, బాన్సువాడ రూరల్​ సీఐ రాజేశ్​, ఎస్సై రాజు, సిబ్బంది ఎస్పీ అభినందించారు.

    More like this

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...