Homeజిల్లాలునిజామాబాద్​Temple Lands | దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి

Temple Lands | దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Temple Lands | నిజామాబాద్ జిల్లాలో దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని రాష్ట్రీయ వానరసేన డిమాండ్​ చేసింది. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో (Prajawani) అసోసియేషన్​ ఆధ్వర్యంలో సభ్యులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రీయ వానరసేన జిల్లా కన్వీనర్ గెంట్యాల వెంకటేష్ మాట్లాడుతూ.. నందిపేట్ (Nandipet) మండలంలోని తల్వేద గ్రామంలో కాకయ్య మందిరానికి దానం చేసిన దేవాలయ భూమిని, ప్రభుత్వ సీలింగ్​ భూములను అక్కడి మాజీ సర్పంచ్ ​(Former Sarpanch) అక్రమంగా తన కుమారులపై రిజిస్ట్రేషన్​ చేసుకున్నారన్నారు.

ఈ భూముల్లో మాజీ సర్పంచ్​ రైస్​మిల్​ నిర్మించి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే ఆర్మూర్ ఆర్డీవో విచారణ (Armoor RDO Investigation) చేసి నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ భూమిని నలుగురు కుమారుల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినందున, ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.