ePaper
More
    Homeజాతీయంimmigrants | 30 రోజుల్లో అక్రమ వలసదారులను గుర్తించాలి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం​

    immigrants | 30 రోజుల్లో అక్రమ వలసదారులను గుర్తించాలి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం​

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: immigrants : శ్రీలంక తమిళ జాతీయుడి (Sri Lankan Tamil national) నిర్బంధం కొనసాగింపులో జోక్యం చేసుకోవడానికి సోమవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత దేశం “ధర్మశాల” (హోటల్)”dharamshala” (hotel) కాదని పేర్కొంది.

    శ్రీలంక జాతీయుడి ఆశ్రయం కోసం దాఖలైన పిటిషన్​పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. “ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలా? మనం ఇప్పటికే 140 కోట్లతో ఇబ్బంది పడుతున్నాం. భారత్​ అన్ని ప్రాంతాల నుంచి వచ్చే విదేశీయులకు ఆతిథ్యం ఇచ్చే ధర్మశాల కాదు” అని ఉటంకించింది.

    శ్రీలంకలో ఒకప్పుడు చురుకుగా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (Liberation Tigers of Tamil Eelam – LTTE) తో సంబంధం ఉన్నాడనే అనుమానంతో విదేశీ జాతీయుడిని 2015లో పోలీసులు అరెస్టు చేశారు. 2018లో, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) (Unlawful Activities (Prevention) Act) సెక్షన్ 10 కింద ట్రయల్ కోర్టు పిటిషనర్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. అతడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా, 2022లో మద్రాసు హైకోర్టు(Madras High Court) అతడి శిక్షను 7 సంవత్సరాలకు తగ్గించింది. కానీ, శిక్ష విధించిన వెంటనే అతను భారత్​ విడిచి వెళ్లాలని, అతను దేశం విడిచి వెళ్లే వరకు శరణార్థి శిబిరంలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.

    కాగా, వీసాపై భారత్​కు వచ్చిన పిటిషనర్.. తన స్వదేశంలో ప్రాణాలకు ముప్పు ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. పలు అనారోగ్యాలతో బాధపడుతున్న పిటిషనర్ భార్య, పుట్టుకతోనే గుండె జబ్బు ఉన్న ఆయన కుమారుడు భారతదేశంలో స్థిరపడ్డారని పిటిషనర్​ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ దత్తా “ఇక్కడ స్థిరపడటానికి మీకు ఏ హక్కు ఉంది?” అడిగారు. తాను శరణార్థినని, తన భార్య, పిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని పిటిషనర్​ చెప్పుకొచ్చారు. కాగా, ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో స్థిరపడే ప్రాథమిక హక్కు దేశ పౌరులకు మాత్రమే ఉందని జస్టిస్ దత్తా స్పష్టం చేశారు.

    బంగ్లా, మయన్మార్​ అక్రమ వలసదారులను గుర్తించాలి..

    సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. బంగ్లాదేశ్(Bangladesh), మయన్మార్(Myanmar) నుంచి అక్రమ వలస వచ్చినవారిని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత అధికారులను ఆదేశించింది. ఇందుకు 30 రోజుల గడువును విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. తదనంతరం అక్రమ వలసదారులను ఆయా రాష్ట్రాలకు పంపేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపట్టనుంది.

    Latest articles

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ ఆరతి నియామకం

    అక్షరటుడే, డిచ్​పల్లి : Telangana University : తెయూకు ఇటీవల ఇంజినీరింగ్​ కళాశాల మంజూరైన విషయం తెలిసిందే. ఫలితంగా...

    Highway Infrastructure IPO | నేడు మరో ఐపీవో ప్రారంభం.. భారీ లాభాలను సూచిస్తున్న జీఎంపీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Highway Infrastructure IPO : స్టాక్ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు మరో కంపెనీ ఐపీవో(IPO)కు...

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉన్నాయి. సోమవారం యూఎస్‌, యూరోప్‌...

    Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి....

    More like this