అక్షరటుడే, బోధన్: Bodhan| అక్రమ వలసదారులను పంపించేయాలి| దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను గుర్తించి దేశం నుంచి పంపివేయాలని బీజేపీ(BJP) నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణ అధ్యక్షుడు గోపికిషన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కిరణ్మయికి (Sub-Collector Kiranmayi) వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పహల్గావ్ ఉగ్రదాడి (Pahalgaon terror attack) నేపథ్యంలో దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్(Pakistan), బంగ్లాదేశీయులను (Bangladesh) వెంటనే తరిమేయాలన్నారు. కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ అలాంటి వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, నాయకులు బాలరాజు, వినోద్, సందీప్, గౌతం, వాసు, తదితరులు పాల్గొన్నారు.
