Nizamabad city | సర్వే నంబర్​ 249లో మళ్లీ అక్రమ నిర్మాణాలు.. చోద్యం చూస్తున్న అధికారులు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad city | నిజామాబాద్​ శివారులోని అర్సపల్లిలో గల ప్రభుత్వ భూమిలో మళ్లీ అక్రమ నిర్మాణాలు మొదలయ్యాయి. సర్వే నంబర్​ 249లో కొందరు అక్రమార్కులు ఓ మాజీ కార్పొరేటర్​ సాయంతో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. గతంలో ఈ సర్వే నంబర్​లో నిర్మాణాలు చేపట్టగా.. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా తేల్చారు. అనంతరం హద్దులు ఫిక్స్​ చేసి కట్టడాలను నిలిపివేయించారు. తిరిగి అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. Nizamabad […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad city | నిజామాబాద్​ శివారులోని అర్సపల్లిలో గల ప్రభుత్వ భూమిలో మళ్లీ అక్రమ నిర్మాణాలు మొదలయ్యాయి. సర్వే నంబర్​ 249లో కొందరు అక్రమార్కులు ఓ మాజీ కార్పొరేటర్​ సాయంతో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. గతంలో ఈ సర్వే నంబర్​లో నిర్మాణాలు చేపట్టగా.. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా తేల్చారు. అనంతరం హద్దులు ఫిక్స్​ చేసి కట్టడాలను నిలిపివేయించారు. తిరిగి అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Nizamabad city | నిజామాబాద్‌ నార్త్‌ మండలంలో..

నిజామాబాద్‌ నార్త్‌ మండలంలోని సర్వే నంబర్‌ 249లో మొత్తం 1,581 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గతంలో కొందరు ఇళ్లు నిర్మించారు. దీంతో అప్పట్లో ఆరో టౌన్‌ పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో సర్వే జరిపి ఇళ్లు నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీలో ఉన్న ఓ మాజీ కార్పొరేటర్​ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అతగాడి అందండలతోనే తాజాగా కొందరు డబుల్​ బెడ్​రూం ఇళ్లను నిర్మిస్తున్నట్లు సమాచారం. సదరు మాజీ కార్పొరేటర్​ నకిలీ దస్త్రాలను సృష్టించి 249 ​సర్వే నంబర్​లోని ప్రభుత్వ భూమిని పేదలకు విక్రయించాడు. వాటి ఆధారంగానే పలువురు నిర్మాణాలు పూర్తి చేశారు.

Nizamabad city | మాజీ కార్పొరేటర్​ అండదండలు..

గత కొద్దిరోజులుగా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో తిరిగి అక్రమ నిర్మాణాలు మొదలు పెట్టినట్లు సమాచారం. మరో వైపు మాజీ కార్పొరేటర్​ అండదండలు అందించడమే కాకుండా.. డబుల్​ బెడ్​రూం ఇళ్ల కింద ఆర్థిక సహాయం అందించేలా చూస్తానని వారికి హామీ ఇవ్వడం కొసమెరుపు. వాస్తవానికి ప్రభుత్వ భూమిలో నిర్మించే ఇళ్లకు రెండు పడక గదుల ఇళ్ల స్కీం వర్తించదు. అయినప్పటికీ సదరు మాజీ ప్రజాప్రతినిధి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి అండదండలు అందించడం గమనార్హం.

Nizamabad city | కళ్లు మూసుకున్న అధికారులు

ప్రభుత్వ భూమిలో తిరిగి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెతి చూడడం లేదు. అధికార పార్టీ మాజీ కార్పొరేటర్​ ఓ మైనారిటీ నేతకు అత్యంత సన్నిహితంగా ఉండడంతో అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి సాధారణ ప్రజలు అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకునే అధికారులు ఇక్కడ కనీసం పట్టించుకోవడం లేదు. గతంలో హడావుడి చేసి కేసులు నమోదు చేసినా.. తాజాగా కేసు అటకెక్కించారు. కేసును సైతం నీరు గార్చినట్లు సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Projects Completion | రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి  (CM Revanth...

NSUI Sandeep Challenge | సమయం ఖరారు చేసి చెప్పాలి..: ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్

అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep Challenge | ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఎమ్మెల్యే సవాల్​కు తాము సిద్ధమని, సోమవారం...

Neelam Chinna Rajulu | ఎమ్మెల్యేకు ప్రాణహాని ఉంది..: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు

అక్షరటుడే, కామారెడ్డి: Neelam Chinna Rajulu | కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి ప్రాణహాని ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు...

TGSPDCL WhatsApp Services | వాట్సాప్​లో విద్యుత్​ శాఖ సేవలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSPDCL WhatsApp Services | మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ శాఖలు సైతం అప్​డేట్ అవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ...