HomeసినిమాIleana | పెద్ద షాక్ ఇచ్చిన ఇలియానా.. ముచ్చ‌ట‌గా మూడో సారి ప్రెగ్నెన్సీ..!

Ileana | పెద్ద షాక్ ఇచ్చిన ఇలియానా.. ముచ్చ‌ట‌గా మూడో సారి ప్రెగ్నెన్సీ..!

Ileana | స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన‌ ఇలియానా చివరిసారి 2024లో విడుదలైన దో ఔర్ దో ప్యార్ సినిమాలో కనిపించారు. విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తితో కలిసి నటించిన ఈ సినిమా తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్‌లను సైన్ చేయలేదు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ileana | ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని (Telugu Film Industry) తన అందం, అద్భుతమైన నటనతో ఏలిన హీరోయిన్ ఇలియానా డి క్రూస్‌ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతోనే వార్తల్లో నిలుస్తున్నారు.

గోవా అందాల సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా, 2006లో దేవదాసు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఇలియానా(Ileana) ఆకస్మికంగా టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి బాలీవుడ్ బాట పట్టారు. మొదట బర్ఫీ వంటి కొన్ని చిత్రాలు హిట్ అయినా, తరువాతి సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు.

Ileana | మ‌రోసారి..

కెరీర్‌లో వెనుకబడిన ఆమె వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఓ ఫోటోగ్రాఫర్‌తో  ప్రేమలో పడి, కొంతకాలం రిలేషన్‌లో ఉన్న ఆమె ఆ సంబంధం విఫలమయ్యాక తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఇలియానా బరువు పెరిగి, సినిమాలకు దూరమయ్యారు. తర్వాత మళ్లీ కోలుకొని సినిమాల్లోకి రావాలనుకున్నా పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇదే సమయంలో ఆమె జీవితంలో కొత్త ప్రేమ పుట్టింది. 2023లో ఆమె హాలీవుడ్ నిర్మాత మైఖేల్ డోలన్‌ను (Producer Michael Dolan) పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే తమ తొలి బిడ్డ కోవా ఫీనిక్స్ డోలన్​కు జన్మనిచ్చారు.

ఇటీవల ఆమె రెండోసారి తల్లిగా మారి కీను రాఫే డోలన్ అనే బిడ్డకు జన్మనిచ్చారు. తల్లిగా మారిన అనుభవం గురించి మాట్లాడుతూ ఇలియానా హృదయానికి హత్తుకునే విషయాలు వెల్లడించారు. “మొదటి బిడ్డ పుట్టినప్పుడు కొత్త జీవితాన్ని అంగీకరించడం కొంత సులభం అనిపించింది. కానీ రెండోసారి మాత్రం పరిస్థితులు భిన్నంగా మారాయి. అప్పటికి ఇద్దరు చిన్నపిల్లల బాధ్యత నాదే. కొన్నిసార్లు మానసికంగా చాలా బలహీనంగా అనిపించింది. స్నేహితులు దూరంగా ఉండడంతో ఏకాంతం పెరిగింది. కానీ భర్త మైఖేల్‌ మద్దతుతో ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాను,” అని ఇలియానా అన్నారు. అయితే ఇలియానా రీసెంట్‌గా బేబి బంప్ వీడియో షేర్ చేయ‌గా, ఇందులో ఊయ‌ల స‌ర్ధుతూ క‌నిపించింది. నా జీవితంలోకి కొత్త ప్రాణ స్నేహితుడు రాబోతున్నాడంటూ కామెంట్ చేసింది. దీంతో ఇల్లీ బేబి మ‌రో బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌బోతుంద‌ని భావించి అంద‌రూ ఆమెకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇలియానా విదేశాల్లో భర్త, పిల్లలతో సంతోషంగా జీవిస్తూ, ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నారు. “నా పిల్లలతో గడిపే ప్రతి క్షణం నాకు అమూల్యం. మాతృత్వంలో దొరికే ఆనందం మరే అనుభవంతో పోల్చలేనిది,” అని ఇలియానా తెలిపారు.