- Advertisement -
HomeUncategorizedIleana | మ‌రోసారి త‌ల్లి కాబోతున్న ఇలియానా.. బేబి బంప్ పిక్స్ వైర‌ల్‌

Ileana | మ‌రోసారి త‌ల్లి కాబోతున్న ఇలియానా.. బేబి బంప్ పిక్స్ వైర‌ల్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Ileana | గోవా బ్యూటీ ఇలియానా (Ileana) గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌ని క‌ట్టిప‌డేస్తుంది. ఒకానొక సమయంలో టాలీవుడ్‌(Tollywood)ని ఏలింది ఈ ముద్దుగుమ్మ‌. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్ లో ఎన్నో హైట్స్ చూసింది. కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. అంతే కాదు వ్యక్తిగతం గాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట ఓ వ్యక్తిగా ఘాడంగా ప్రేమించిన ఈ ముద్దుగుమ్మ‌ ఆతర్వాత అత‌డికి బ్రేక‌ప్ చెప్పింది. దాంతో డిప్రషన్ లోకి వెళ్ళింది. కోలుకొని తిరిగి సినిమాల్లో రాణించాలనుకున్నా అది కుద‌ర‌లేదు.. తర్వాత మరోసారి ప్రేమలో పడింది. కట్ చేస్తే పెళ్ళికి ముందే తల్లయింది.

Ileana | గుడ్ న్యూస్..

బిడ్డ‌కు త‌ల్లిన‌వుతున్నాను! అంటూ తొలి గ‌ర్భాన్ని ప్ర‌క‌టించ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. ఆ బిడ్డ‌కు తండ్రి ఎవ‌రో కూడా చాలా కాలం పాటు దాచి ఉంచింది. అత‌డు మైఖేల్ డోల‌న్ (Michel Dolan).. విదేశీ ప్రియుడు.. పైగా శ్వేత‌జాతీయుడు.. డోల‌న్ అప్పుడ‌ప్పుడు అతిథిలా ఫోటోల్లో క‌నిపిస్తాడు త‌ప్ప బాలీవుడ్ స‌ర్కిల్స్ లో పెద్ద‌గా క‌నిపించింది లేదు. అయితే అత‌డితో మొద‌టి బిడ్డ‌ను క‌న్న ఇలియానా ఇప్పుడు రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది. . ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఇలియానా తన గర్భిణి స్నేహితురాలితో కలిసి నవ్వుతూ, తమ బేబీ బంప్‌లను చూపిస్తూ కనిపించారు. ఈ ఫోటోకు ఆమె “బంప్ బడ్డీస్”(Bump Buddies) అని క్యాప్షన్ ఇచ్చారు.

- Advertisement -

ఇలియానా తన రెండవ గర్భం గురించి గత జనవరిలోనే పరోక్షంగా హింట్ ఇచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో అర్ధరాత్రి తనకు కలిగిన కొన్ని కోరికలను చూపిస్తూ .. మీరు గర్భవతి అని చెప్పకుండానే చెప్పండి” అని క్యాప్షన్ పెట్టి, తన రెండవ గర్భాన్ని ధృవీకరించారు. అప్పటి నుండి అభిమానులు ఆమె నుండి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఇలియానా త‌న రెండ‌వ బిడ్డ కోసం ఎదురు చూస్తుంది. ఇల్లీ బేబి తమిళం, హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. 2006లో ‘దేవదాసు’ devadas సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా దశాబ్ద కాలంగా వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి తెలుగు స్టార్లతో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా(Ileana) తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News