అక్షరటుడే, భీమ్ గల్: Bheemgal | విధి నిర్వహణలో అకాల మరణం చెందిన సెర్ప్–ఐకేపీ సిబ్బంది (SERP-IKP staff) కుటుంబీకులకు కారుణ్య నియామకాలతోనే భరోసా లభిస్తుందని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ నాశెట్టి సుమన్ అన్నారు. కమ్మర్‌పల్లికి (Kammarpally) చెందిన ఐకేపీ సీసీ రాజేశ్వర్ ఇటీవల మృతి చెందగా.. బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం జిల్లా ఐకేపీ సిబ్బంది ద్వారా విరాళాల రూపంలో పోగు చేసిన రూ.75వేలను టీఎన్జీవో కార్యదర్శి శేఖర్, ఐకేపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్, జిల్లా జేఏసీ ఛైర్మన్ బత్తుల మాణిక్యం, రవి విఠల్‌తో కలిసి మృతుడి భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం (state government) ఉద్యోగుల సంక్షేమం కోసం సానుకూలంగా వ్యవహరిస్తుందని, ఐకేపీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కారుణ్య నియామకాల కోసం ఇచ్చిన వినతిపై ఫైల్ ఆర్థిక శాఖకు చేరిందన్నారు.