అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని ఎంపీడీవో సంతోష్ కుమార్ అన్నారు. బదిలీపై వెళ్తున్న ఐకేపీ భీమ్‌గల్ ఏపీఎం రవీందర్‌కు మండల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని విధి నిర్వహణలో ఏపీఎం పప్పుల రవీందర్ సేవలు అమూల్యమైనవన్నారు.
ఐకేపీ సెర్ప్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి మాట్లాడుతూ భీమ్‌గల్ ఏపీఎంగా పనిచేసిన 16 నెలల కాలంలోనే రవీందర్ స్థానిక మహిళల ఆదరణ పొందారని, విలువైన సేవలు మహిళా సంఘాలకు అందించారని పేర్కొన్నారు.
అనంతరం కార్యాలయ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, వీవోఏలు బదిలీపై వెళ్తున్న ఏపీఎం రవీందర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో నర్సయ్య, సీసీలు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్, రఘుపతి, భాస్కర్, గంగాసాయిలు, గంగాధర్, లలిత, సుమలత, సురేష్, గణేశ్, ముత్యం, అన్ని గ్రామ సంఘాల వీవోఏలు, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.