అక్షరటుడే, వెబ్‌డెస్క్: IIM Raipur | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) రాయ్‌పూర్ (IIM Raipur) తన ప్రతిష్ఠాత్మక ‘లీడర్‌షిప్ సమ్మిట్ 2025’ను (Leadership Summit 2025) విజయవంతంగా నిర్వహించింది. “ది సీఎక్స్‌ఓ కంపాస్: నావిగేటింగ్ బియాండ్ బౌండరీస్ టు బిల్డ్ ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్స్” అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన సీఎక్స్‌వోలు, పాలసీ మేకర్లు, వ్యాపారవేత్తలు, మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ రెండు రోజుల సదస్సులో నాయకత్వంలోని పలు అంశాలపై ఆరు ప్యానెల్ చర్చలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన టాటా హిటాచీ కన్‌స్ట్రక్షన్ మెషినరీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సందీప్ సింగ్, భవిష్యత్ సంస్థలకు ఇన్నోవేషన్, కస్టమర్-సెంట్రిసిటీ, సస్టెయినబిలిటీ చాలా ముఖ్యమని చెప్పారు. పెప్సీకో ఇండియాకు చెందిన దీపిక రాజోర్ (Ms.Deepika Rajour) గౌరవ అతిథిగా హాజరై.. ‘పీపుల్-ఫస్ట్’ మరియు ఇంక్లూజివ్ లీడర్‌షిప్ ఎంత శక్తివంతమైనదో వివరించారు.
ఐఐఎం రాయ్‌పూర్ డైరెక్టర్-ఇన్-ఛార్జ్ ప్రొ.సంజీవ్ ప్రషార్ (Prof.Sanjeev Prashar) మాట్లాడుతూ.. “నిజమైన నాయకత్వం అనేది అధికారం, పదవికే పరిమితం కాదు. అది విజన్, అడాప్టబిలిటీ, మరియు ఒక లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు కోసం సిద్ధమయ్యే సంస్థలు టెక్నాలజీ, ఇన్నోవేషన్‌తో (technology and innovation) పాటు మానవ విలువలపైనా దృష్టి పెడతాయి” అని అన్నారు. ఈ సమ్మిట్‌లో శ్రీ కృష్ణ మిశ్రా (సీఈఓ, ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా), శ్రీ ప్రంజల్ కామ్ర (ఫౌండర్, ఫినాలజీ), శ్రీ ఆశిష్ కపూర్ (హెడ్, మహీంద్రా టెకో) వంటి అనేక మంది ప్రముఖులు మాట్లాడారు.