ePaper
More
    HomeతెలంగాణHyper Tension Day | హైపర్ టెన్షన్​పై నిర్లక్ష్యం సరికాదు

    Hyper Tension Day | హైపర్ టెన్షన్​పై నిర్లక్ష్యం సరికాదు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Hyper Tension Day | హైపర్​టెన్షన్​ను నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు పెరుగుతాయని మెడికవర్​ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో మెడికవర్​ హాస్పిటల్స్​ ఆధ్వర్యంలో 2కే రన్​ నిర్వహించారు. రన్​ను చిన్నపిల్లల వైద్యుడు సురేష్​ జాజు జెండా ఊపి ప్రారంభించారు. 2కే రన్​ ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుంచి ప్రారంభమై కోర్టు చౌరస్తా మీదుగా సాగింది.

    ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్​ సందీప్​రావు మాట్లాడుతూ.. హైపర్​ టెన్షన్​పై అవగాహన కోసం 2కే రన్​ నిర్వహించడం శుభపరిణామమన్నారు. ప్రపంచవ్యాప్తంగా మే 17న హైపర్​ టెన్షన్​ డే(బీపీ దినోత్సవం) నిర్వహిస్తారన్నారు. సమయాలనుకూలంగా భోజనం చేయడం, వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చన్నారు. ఈ అవగాహన ర్యాలీలో ఓపెన్ హార్ట్ సర్జన్ డాక్టర్ అవిన్ సనార్, న్యూరో సర్జన్ శ్రీకృష్ణ ఆదిత్య, నెఫ్రాలజిస్ట్ అజయ్ కుమార్, విశ్వనాథ్ పాటిల్, జనరల్ సర్జన్ మనోజ్, యజ్ఞ, సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్​, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి స‌భ వాయిదా.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kamareddy | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వ‌హించ...

    Minister Vakiti Srihari | రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Vakiti Srihari | తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని...

    Tamil Nadu | ఫ్రెండ్స్​తో బెట్టింగ్​.. కారుతో సముద్రంలోకి.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu | కొందరు యువత ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు....