IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్​ మెయిన్స్​ ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్ (Indian Forest Service) మెయిన్స్​​ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితా వెల్లడించింది. వెబ్​సైట్​లో లిస్ట్​ను ఉంచింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష 2025 నవంబర్ 16 నుంచి నవంబర్ 23 వరకు జరిగింది. మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) దశకు తమ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్ (Indian Forest Service) మెయిన్స్​​ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితా వెల్లడించింది. వెబ్​సైట్​లో లిస్ట్​ను ఉంచింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష 2025 నవంబర్ 16 నుంచి నవంబర్ 23 వరకు జరిగింది. మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) దశకు తమ అర్హత స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీ (Delhi)లోని ధోల్పూర్​ హౌస్​లో గల యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13, 2026 ఓఏఎఫ్​ సమర్పించవచ్చు. తుది ఎంపిక వయస్సు, విద్యా అర్హతలు, రిజర్వేషన్ క్లెయిమ్‌లకు సంబంధించిన అసలు పత్రాల ధృవీకరణకు లోబడి ఉంటుంది.

అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ (OAF)లో తమ వివరాలను నమోదు చేయాలి. ఇందులో విద్యా స్థితి, సేవా ప్రాధాన్యతలు, కేడర్ ఎంపికలు ఉంటాయి నిర్ణీత సమయంలోపు ఈ ఫారమ్‌ను సమర్పించడంలో విఫలమైతే అభ్యర్థిత్వం రద్దు అవుతుంది. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు అసలు సర్టిఫికెట్లను సమర్పించాలి. ఇంటర్వ్యూ (Interview) షెడ్యూల్, ఇ-సమ్మన్ లెటర్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా మొత్తం 231 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Saudi Poultry Import Ban | సౌదీ కీలక నిర్ణయం.. భారత్​ నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతిపై నిషేధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Saudi Poultry Import Ban | సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​ సహా 40 దేశాల...

Odisha Mines Officer Bribery | లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్​ అధికారి.. ఇంట్లో రూ.4 కోట్లు సీజ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha Mines Officer Bribery | ఒడిశాలోని ప్రభుత్వ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా...

Private Hospital Case | ప్రైవేట్​ ఆస్పత్రిలో యువకుడి అనుమానాస్పద మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధితులు

నగరంలో ప్రైవేట్​ ఆస్పత్రిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆస్పత్రిలో మత్తు వైద్యుల నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

Inter Exams in Nizamabad | ప్రశాంతంగా ఇంటర్​ పరీక్షలు ప్రారంభం

అక్షరటుడే, ఇందూరు: Inter Exams in Nizamabad | జిల్లావ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు (Inter Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి...