అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khairatabad Ganesh | రెండు తెలుగు రాష్ట్రాలలో ఖైరతాబాద్ (హైదరాబాద్) గణేశునికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ కొలువు దీరిన గణనాథుడు విశిష్ట పూజలు అందుకుంటారు..
ఈ సంవత్సరం 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి(Sri Vishwasanthi Mahashakti Ganapati)ని ఏర్పాటు చేయగా, నిన్న చివరి దశ నేత్రావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నేత్రావిష్కరణ అనంతరం ‘బడా గణేశ్ ఆగమన్’ కార్యక్రమాన్ని(Big Ganesh Agaman Program) ఎంతో ఘనంగా నిర్వహించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్(Khairatabad Ganesh) పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీని బట్టి ప్రతి రోజు ఉదయం 11:00 గంటల నుండి అర్ధరాత్రి వరకూ ట్రాఫిక్ మళ్లింపులు జరుగుతాయని వెల్లడించారు.
Khairatabad Ganesh | ముఖ్య ట్రాఫిక్ మళ్లింపులు ఇవే:
- వీవీ స్టాచ్యూ → మింట్ కాంపౌండ్ దారి: ఈ దిశగా వెళ్ళే వాహనాలు నిరంకారీ జంక్షన్ వైపు మళ్లించబడతాయి.
- ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ → బడా గణేష్ దారి: వాహనాలను ఇక్బాల్ మీనార్ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మీనార్ → ఐమాక్స్ దిశలో వెళ్లే ట్రాఫిక్‌ను తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- నెక్లెస్ రోటరీ → మింట్ కాంపౌండ్ ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ లేదా తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- నిరంకారీ → ఖైరతాబాద్ పోస్టాఫీస్ మీదుగా రైల్వే గేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ జంక్షన్ వైపు మళ్లించనున్నారు.
Khairatabad Ganesh | పార్కింగ్ ఏర్పాట్లు:
నెక్లెస్ రోటరీ / ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే వాహనదారుల కోసం:
- రేస్ రోడ్
- ఎన్టీఆర్ ఘాట్
- ఐమాక్స్ థియేటర్ HUDA పార్కింగ్
- ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం
- సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం
ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వారు:
విశ్వేశ్వరయ్య భవన్ వద్ద వాహనాలు పార్క్ చేసుకోవచ్చు.
Khairatabad Ganesh | భక్తులకు సూచనలు:
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించమని సూచించారు. ప్రయాణ సంబంధిత సమస్యల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626 కు సంప్రదించవచ్చు.