HomeUncategorizedCovid Test | ప్రధానిని కలవాలంటే కోవిడ్​ టెస్ట్​ చేయించుకోవాల్సిందే..

Covid Test | ప్రధానిని కలవాలంటే కోవిడ్​ టెస్ట్​ చేయించుకోవాల్సిందే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Covid Test | దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు(Corona Cases) పెరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య ఏడు వేలు దాటింది. ఈ క్రమంలో పీఎంవో కార్యాలయం(PMO Office) కీలక ప్రకటన చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని కలిసే మంత్రులు తప్పనిసరిగా కరోనా ఆర్టీ పీసీఆర్​ పరీక్ష(Corona RT PCR test) చేయించుకోవాలని ఆదేశించింది.

దేశంలో ప్రస్తుతం కోవిడ్​ యాక్టివ్​ కేసులు 7,121కు చేరాయి. 24 గంటల్లో 306 కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటివరకు కోవిడ్‌తో 74 మంది చనిపోయారు. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో కోవిడ్​ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కేరళలో 2,223 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండటం గమనార్హం. ఏపీలో 72, తెలంగాణలో 11 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.