ePaper
More
    HomeజాతీయంFake News | ఫేక్​ వార్తలు ప్రచారం చేస్తే ఇక జైలుకే..

    Fake News | ఫేక్​ వార్తలు ప్రచారం చేస్తే ఇక జైలుకే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Fake News | ప్రస్తుతం సోషల్​ మీడియా యుగంలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవడం కూడా కష్టం అవుతోంది. కొందరు ఫేక్​ వార్తలను (Fake News) ప్రచారం చేస్తున్నారు. నిజమైన వార్తల కంటే వేగంగా ఇవి ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో నకిలీ వార్తల కట్టడికి కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) సిద్ధమైంది.

    Fake News | ఏడేళ్ల జైలు శిక్ష

    నకిలీ వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంతేగాకుండా పలు పార్టీల సోషల్​ మీడియా (Social Media) వింగ్​లు కూడా ఫేక్​ వార్తలను ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం త్వరలోనే  ఓ చట్టాన్ని తీసుకు రాబోతుంది. నకిలీ వార్తలు ప్రచారం చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇది చట్ట రూపం దాల్చితే ఫేక్​ రాయుళ్లకు చుక్కలు కనిపించడం ఖాయం.

    Fake News | ప్రత్యేక కోర్టుల ఏర్పాటు

    తప్పుడు వార్తలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు (Special Courts) సైతం ఏర్పాటు చేయనున్నారు. అంతేగాకుండా ఈ కోర్టులకు పబ్లిక్​ ప్రాసిక్యూటర్లను కూడా నియమించాలని కర్ణాటకలోని కాంగ్రెస్​ గవర్నమెంట్​ యోచిస్తోంది. దీంతో నకిలీ వార్తలు వ్యాప్తి చేసే వారికి త్వరగా శిక్ష పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వారం క్రితం ఈ బిల్లును కేబినెట్​లో ప్రవేశపెట్టారు. త్వరలోనే ఇది చట్టరూపం దాల్చనుంది.

    Fake News | రాష్ట్రంలోనూ అమలు చేయాలి

    దేశవ్యాప్తంగా నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నారు. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. తెలంగాణ (Telangana)లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలో కూడా నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి చట్టం తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షడు మహేశ్​కుమార్​ గౌడ్ (PCC Chief Mahesh Goud) ఫేక్​ వార్తలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. దీనికోసం అవసరమైతే చట్టం కూడా తెస్తామన్నారు. దీంతో రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టం తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...